ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ - Nandi Awards 2011




తెలుగు సినిమా కు అత్యంత ప్రతిష్టాత్మకం నంది అవార్డు. గత ఏడాది విడుదలైన చిత్రాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించిన కమిటీ విజేతల పేర్లను ప్రకటించింది. ముందే ఊహించినట్లే ఉత్తమ చిత్రం అవార్డును వేదం సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ నటుడుగా నందమూరి బాలకృష్ణ రెండో సారి నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. సింహ సినిమాలో కనబరిచిన ఉత్తమ శ్రేణి నటనకు గాను బాలకృష్ణ అవార్డు గెలుచుకున్నారు. తొలిచిత్రం తోనే ఉత్తమ నటి అవార్డును మలయాళ నటి నిత్య మీనన్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా గంగపుత్రులు కు దక్కడం విశేషం. కుటుంబ కథాచిత్రంగా అందరి బందువయా ఎంపికయ్యింది
.

ప్రత్యేక జ్యూరి పురస్కారాలకు కథానాయకులు మంచు మనోజ్, సునీల్ ఎంపిక అయ్యారు. ఇవి కాకుండా ఇతర రంగాలకు చెందిన కేటగిరీల్లో సింహ, అలా మొదలయింది, డార్లింగ్, వేదం వంటి చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి.ఉత్తమ నటుడుగా బాలకృష్ణ నంది పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు నరసింహనాయుడు సినిమాకు అవార్డు అందుకున్నారు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో మరే హీరో ప్రబావితం చేసే నటన చూపకపోవడంతో బాలకృష్ణకు పోటి లేకపాయింది. అలాగే వేదం సినిమాలో నటించిన అనుష్క కు ఉత్తమ నటి వస్తుందని అనుకున్నా, డబ్బింగ్ వేరే వారిచేత చెప్పించడం వల్ల ఆమెకు అవార్డు మిస్ అయ్యింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా చక్రి ఎంపిక కావడం పట్ల విమర్శలు రావచ్చు. కాకపోతే సింహ లో “లక్ష్మి నరసింహ..” వంటి మెలోడి కి ట్యూన్ కట్టి ఆయన అవార్డుకు అర్హుడుగా నిరూపించుకున్నారు. క్రితం ఏడాది కీరవాణి లాంటి సంగీత ఉద్దండులు తమ స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించలేదు అనేది వాస్తవం. కనుక విమర్శల తాకిడి మరీ శృతి మించకపోవచ్చు. ఎవరూ ఊహించని రీతిలో గంగపుత్రులు, వీర తెలంగాణా చిత్రాలు అవార్డులను గెలుచుకొని మంచి చిత్రాల రేసులో నిలవడం అభినందనీయం. విశేషం ఏమంటే, అవార్డుల కమిటీ చైర్మన్ అయిన

No comments:

Post a Comment